త్రివిక్రమ్ కథలు.. అన్ని డిజాస్టర్లే!


త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా టాలీవుడ్ లో నెంబర్ వన్ అని చెప్పవచ్చు. మన తెలుగు ఫ్లేవర్ కు తగ్గట్టుగా కామెడీ పంచ్ ఎమోషనల్ టచ్.. బెస్ట్ మ్యూజిక్ ఇలా అన్ని సమపాళ్లలో ఉంచి సినిమాను తీసుకు రాగల త్రివిక్రమ్ అంటే అందరికి ఇష్టమే. అయితే త్రివిక్రమ్ రాసిన కథలు ఏవి కూడా రీమేక్ లో సక్సెస్ అయిన సందర్భాలు లేవు.

ఇటీవల వచ్చిన అల.. వైకుంఠపురములో హిందీ రీమేక్ షెహజాద దారుణంగా దెబ్బ కొట్టింది. ‘నువ్వు నాకు నచ్చావ్’ను తమిళంలో విజయ్ ‘వశీకర’ పేరుతో రీమేక్ చేయగా.. అక్కడ అదొక పెద్ద డిజాస్టర్. త్రివిక్రమ్ తీసిన బెస్ట్ మూవీస్‌లో ఒకటైన ‘అతడు’ను బాలీవుడ్ బాబీ డియోల్ రీమేక్ చేయగా అది కూడా ఫ్లాప్ అయ్యింది. 

‘జులాయి’ని తమిళంలో ‘సాగసం’ రాగా ‘అత్తారింటికి దారేది’ని ‘వందా రాజాదా వరువేన్’ టైటిల్ తో శింబు రీమేక్ చేశాడు. రెండు డిజాస్టర్ అయ్యాయి. ఏదేమైనా కూడా త్రివిక్రమ్ కథలు మనవాళ్లకు నచ్చినంతగా మిగతా లాంగ్వేజ్ వారికి ఎక్కవు. ఎందుకంటే ఆయన డైలాగ్స్ మేకింగ్ విధానం అలా ఉంటుంది. కేవలం హిట్ అయ్యిందని సాకుతో త్రివిక్రమ్ కథలను రీమేక్ చేసిన ప్రతీసారి దెబ్బ కొట్టాయి. మరి మహేష్ సినిమా పాన్ ఇండియా అంటున్నారు. ఏమవుతుందో?

Post a Comment

Previous Post Next Post