ఆ జానర్ లో నాగార్జున న్యూ స్టోరీ!


అక్కినేని నాగార్జున చివరిసారిగా నటించిన ది ఘోస్ట్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.  ఆ తర్వాత నాగార్జున కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. కానీ తన తదుపరి సినిమాపై ఆసక్తికర అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నాగార్జున తదుపరి చిత్రానికి ధమాకా రచయిత ప్రసన్న కుమార్ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే.

ఈ కాంబినేషన్ పై గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి.  ఇప్పుడు తాజా గాసిప్ ఏమిటంటే ఈ సినిమా 70, 80ల నాటి పీరియాడికల్ డ్రామా అని తెలుస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మితమయ్యే ఈ ప్రాజెక్ట్ కు ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదు. పేరు పెట్టని ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించనున్నాడని కూడా ఒక టాక్ వస్తోంది.  ఈ సినిమా ఫిబ్రవరి మధ్యలో ప్రారంభం కానుందని సమాచారం.

Post a Comment

Previous Post Next Post