మహేష్ 28.. టైటిల్ వచ్చేది అప్పుడే!


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇంకా ఈ సినిమాకు దర్శకుడు ఎలాంటి టైటిల్ ఫైనల్ చేశాడు అనే విషయంలో కూడా ఇంతవరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు.

అర్జునుడు అనే టైటిల్ అనుకుంటున్నట్లు ఆ మధ్య చాలా రకాలు కథనాలు వచ్చాయి. కానీ సినిమా షూటింగ్ సగం పూర్తయిన తర్వాత కానీ ఈ విషయంలో అప్డేట్ ఇవ్వకూడదు అని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఉగాది కానుకగా సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను టైటిల్ తో సహా రివీల్ చేయాలని చూస్తున్నారు. ఉగాదికి అయితే బెస్ట్ అని ఒక టైటిల్ కూడా దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ కూడా అ.. అక్షరంతోనే ఉండే అవకాశం ఉందట. మరి త్రివిక్రమ్ మహేష్ బాబును ఏ విధంగా ప్రజెంట్ చేస్తాడో అదే రోజు క్లారిటీ వస్తుంది

Post a Comment

Previous Post Next Post