పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. ఇక మిగిలిన షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది అనే విషయంలో ఇంతవరకు చిత్ర యూనిట్ అధికారికంగా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. దర్శకుడు క్రిష్ మాత్రం సినిమాను తొందరగా పూర్తి చేసి ఈ ఏడాది దసరా సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు.
ఒకవేళ అప్పుడు కుదరకపోతే సినిమా మళ్ళీ వచ్చే సంక్రాంతికి రావాల్సి ఉంటుంది. కానీ అప్పుడు మాత్రం పోటీ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా గురించి మరో టాక్ వైరల్ గా మారింది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే కొనసాగుతోంది. దర్శకుడు ముందుగా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా మొదటి భాగాన్ని పూర్తి చేసి ఆ తర్వాత రిజల్ట్ ను బట్టి సెకండ్ పార్ట్ విడుదల చేసే అవకాశం ఉంటుందని కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో అధికారికంగా క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే.
Follow
Post a Comment