SSMB 28: రెమ్యునరేషన్స్ బ్యాలెన్స్ చేసిన ఓటీటీ డీల్!


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సినిమాను ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే సినిమా ప్రమోషన్స్ ఇంకా మొదలు కాకముందే నాన్ థియేట్రికల్ బిజినెస్ రూపంలో నిర్మాతలకు భారీగా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.

ఇక నెట్ ఫ్లిక్స్ ముందుగానే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు సినిమాలోని ప్రధాన క్యాస్ట్ కు సంబంధించిన మొత్తం కూడా సెట్ అయ్యేలా నెట్ ఫ్లిక్స్ వారికి డీల్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు మహేష్ బాబుకు 70 కోట్లు రెమ్యునరేషన్ తిసుకుంటున్నాడు. ఇక పూజా హెగ్డేకు 4 కోట్లు వస్తున్నాయి. ఇక సంగీత దర్శకుడు థమన్ ఆరు కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఈ మొత్తం రికవరీ అయ్యేవిధంగా నిర్మాతలు డిజిటల్ హక్కులను 80 కోట్లకు అమ్మినట్లు సమాచారం. దాదాపు SSMB28 అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post