నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా మంచి హిట్‌టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మొదటి ఆట నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో నందమూరి బాలకృష్ణ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా కూడా నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ఒకటి హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సక్సెస్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు ఇప్పుడు హార్ట్ టాపిక్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో నందమూరి బాలకృష్ణకు యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వసిన్తో మంచి బాండింగ్ ఏర్పడింది.
వీరిద్దరూ అన్‌స్టాపబుల్‌లో ఒక ఎపిసోడ్ లో కూడా పాల్గొనడంతో వీరి మధ్య సానిహిత్య సంబంధాలు ఏర్పడడంతో వారిని కూడా సక్సెస్ మీట్ గా ఆహ్వానించాడు బాలకృష్ణ. వారిని స్టేజి మీదకు పిలిచి మాట్లాడుతూ గతంలో తాను నిజం కాలేజీలో చదువుకుంటున్న సమయంలో తనకు కూడా నార్త్ ఫ్రెండ్స్ ఉండేవారని వారితో మాట్లాడేటప్పుడు.. సాలె అంటూనే మరొక బూతు పదం కూడా వాడేశారు. సాధారణంగానే నందమూరి బాలకృష్ణ స్టేజ్ మీద ఏం మాట్లాడుతారో తెలియకుండానే మాట్లాడి వివాదాలకు కేంద్రబిందువుగా మారుతూ ఉంటారు.
గతంలో కూడా అనేక సందర్భాలలో మాట్లాడకూడని మాటలు మాట్లాడి అందరికీ టార్గెట్ ఆయన ఇప్పుడు... బూతు మాట మాట్లాడడమే కాదు... అక్కినేని తొక్కినేని అంటూ కూడా మాట్లాడి హాట్ టాపిక్ అయ్యారు. వాస్తవానికి నిన్ననే అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి. అలాంటి రోజున ఆయనను స్మరించుకుని నివాళి అర్పించాల్సింది పోయి అక్కినేని తొక్కినేని అంటూ వివాదాస్పదంగా మాట్లాడారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
అయితే నందమూరి బాలకృష్ణ కావాలని అనలేదని ఆయన మాటలలో పొరపాటున పదం దొర్లి ఉంటుందని ఆయన అభిమానులు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్న అక్కినేని అభిమానులతో పాటు అందరూ కూడా ఈ విషయాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. బాలకృష్ణ ఇకమీదటైనా స్టేజి మీద మాట్లాడేటప్పుడు శ్రద్ధగా మాట్లాడకపోతే ఇబ్బంది తప్పదని హెచ్చరిస్తున్నారు.
Follow
Post a Comment