KGF మేకర్స్.. 3 వేల కోట్ల పెట్టుబడి!

KGF: చాప్టర్ 1 విడుదలయ్యే ముందు వరకు కూడా హోంబలే ఫిల్మ్స్ గురించి ఎవరికి పెద్దగా తెలియదు.  ఈ సంస్థ ప్రతి చిత్ర పరిశ్రమను శాండల్‌వుడ్ వైపు చూసేలా చేసింది. తరువాత 2022లో ఈ ప్రొడక్షన్ హౌస్ లోనే రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ KGF: చాప్టర్ 2, కాంతార సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మేకర్స్ మరో బిగ్ టార్గెట్ సెట్ చేసుకున్నారు.


వారి రాబోయే ప్లాన్లకు సంబంధించి అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేశారు.  విజయ్ కిరగందూర్ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ప్రముఖ బ్యానర్ రాబోయే 5 సంవత్సరాలలో 3000 కోట్ల పెట్టుబడితో సినిమాలను తీసుకు రాబోతోంది. సలార్, సుధా కొంగర ప్రాజెక్ట్ అలాగే మరో 4 సినిమాలను కూడా భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. అలాగే భవిష్యత్తులో కాంతార సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఆ మధ్య ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.

Post a Comment

Previous Post Next Post