వాల్తేరు వీరయ్య - మూవీ రివ్యూ & రేటింగ్


కథ:
వైజాగ్ పోర్ట్‌లో వీరయ్య (చిరంజీవి), కాలా (ప్రకాశరాజ్) ఇద్దరు స్నేహితులుగా అలాగే వ్యాపార భాగస్వాములుగా ఉంటారు. ఇక కాలా దుర్మార్గుడిగా మారి, వీరయ్యను మోసం చేసి, మలేషియాకు పారిపోతాడు. ఇక కాలాకు పాఠం చెప్పడానికి వీరయ్య మలేషియా ప్రయాణం చుట్టూ మిగతా కథ తిరుగుతుంది. ఇక రవితేజ ఈ కథలోకి ఎలా వస్తాడు? అసలు డ్రగ్స్ మాఫీయా గుట్టు ఎలా బయటపడుతుంది? అనేవి కథలోని మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు. 

విశ్లేషణ:
కిడ్నాప్ చేయబడిన భారత నావికాదళ అధికారులను రక్షించే ఎపిసోడ్‌తో వీరయ్య పాత్ర కథలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక భారతీయ సైన్యానికి మత్స్యకారుని సహాయం చేసే ఎపిసోడ్ అయితే అవసరమా అనే రేంజ్ లో కొంత అతిగా అనిపిస్తుంది. మరోవైపు నేరస్థుడు సోలమన్ (బాబీ సింహా)ని పట్టుకోవడానికి కొన్ని సీన్స్ కొనసాగే విధానం కామెడీకి స్కోప్ ఉన్నప్పటికీ, ఇది చాలా బలవంతంగా కనిపిస్తుంది. 

ఫస్ట్ హాఫ్ లో మెగాస్టార్ కు సంబంధించిన చాలా సీన్స్ కూడా వింటేజ్ చిరుని చూపిస్తాయి కానీ మరికొన్ని సీన్స్ మాత్రం రొటీన్ రొట్టలా అనిపిస్తాయి.  ఇంటర్వెల్ బ్లాక్ బాగానే ఉన్నా ఊహించని రేంజ్ లో అయితే సెకండ్ హాఫ్ పై అంచనాలను పెంచదు. ఇక సెకండాఫ్ కొన్ని బాండింగ్ సీన్స్ తో కొనసాగుతాయి. వీరయ్య అలాగే ACP పాత్రలో రవితేజలకు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలు హైలెట్ అవుతాయి. ఇక వారి మధ్య విబేధాలు రావడానికి దారితీసిన గొడవలు కూడా హైలెట్ అవుతాయి. 

ఇక వీరయ్యను దోషిగా చిత్రీకరించడంలో కాలా చేసిన ద్రోహం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇక చిరంజీవి పాత కామెడీ కూడా బాగానే నవ్వులు తెప్పిస్తాయి. కానీ కొన్ని సీన్స్ అస్సలు సెట్ అవ్వవు. చిరంజీవి లాంటి పెద్ద హీరోపై ‘జంబలకిడి జారు మిఠాయి’ లాంటి చీప్ స్కిట్‌ని డిజైన్ చేయడం చాలా పేలవమైన నిర్ణయం. క్లైమాక్స్ అంతులేని మాఫియా గ్యాంగ్ గన్ ఫైట్‌లతో క్లూలెస్‌గా ఉంది. ఇక బాస్ పార్టీ పాటలో ఇప్పటికే ట్రైలర్‌లలో చూపించిన ఒక మంచి స్టెప్ మాత్రమే ఉంది.  పూనకాలు లోడింగ్ సాంగ్ మాస్ అప్పీల్‌గా ఉంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతో తప్పు లేదు కానీ మిగతా స్క్రీన్ ప్లే సీన్స్ అంతగా వర్కౌట్ కాలేదు. ఇక మొత్తానికి రవితేజకు మంచి పాత్ర లభించింది, అతని నటన బాగుంది.  శ్రుతి హాసన్, కేథరిన్ ఎప్పటిలానే రెగ్యులర్ పాత్రల్లో కనిపించారు. ఇక విలన్లుగా బాబీ సింహా, ప్రకాష్ రాజ్ పర్వాలేదు అనిపించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగానే ఉన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోలేదు. ఇక బాస్ పార్టీ పాట తప్ప బడ్జెట్ తెరపై కనిపించదు. మెగాస్టార్ సినిమాలో మరోసారి వీఎఫ్‌ఎక్స్‌ కూడా అంతగా సెట్టవ్వలేదు.

ప్లస్ పాయింట్స్
👉మెగాస్టార్ చిరంజీవి
👉రవితేజ క్యారెక్టర్
👉రెండు పాటలు

మైనస్ పాయింట్స్:
👉కథలో బలం లేదు
👉యాక్షన్ సీక్వెన్స్ 
👉సెకండ్ హాఫ్

రేటింగ్: 2.75/5

Post a Comment

Previous Post Next Post