ఆహా అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 OTT ప్రపంచంలో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తోంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సెలబ్రిటీ టాక్ షో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు రెడ్ కార్పెట్ పరిచింది. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ అతిథిగా ఉన్న ఒక ఎపిసోడ్ షూట్‌ను పూర్తి చేసారు. ఇక ఆ ఎపిసోడ్ ప్రీమియర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఆహా ఎపిసోడ్ ని సంక్రాంతి స్పెషల్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంటే ఆ ఎపిసోడ్ జనవరి 13 ఆహా OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రీమియర్ అవుతుందట. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రోమో కూడా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఈ ఏడాది సమ్మర్ తరువాత విడుదల కానుంది.
Follow
Post a Comment