ఇటీవల కాలంలో భాషతో సంబంధం లేకుండా కొంతమంది అగ్ర హీరోలు వివిధ భాషల్లో కూడా మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా డబ్బింగ్ రైట్స్ అలాగే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా కూడా సినిమాలకు భారీ స్థాయిలో లాభాలు వస్తున్నాయి. ఒక విధంగా సినిమా విడుదలవడం కంటే ముందుగానే హిందీలో ఇప్పుడు సౌత్ హీరోల సినిమాలను ఎగబడి కొనుకుంటున్నారు.
ఇక ఇటీవల సూర్య సినిమా హిందీ హక్కులు 100 కోట్లకు అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. సూర్య తన తదుపరి యాక్షన్ అడ్వెంచర్ సినిమాను శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా పునర్జన్మల కాన్సెప్ట్ నేపథ్యంలో తెరపైకి రాబోతోంది. అయితే హిందీ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ సూర్య సినిమాతో బిగ్ డీల్ సెట్ చేసుకుంది.
హిందీ థియేట్రికల్ హక్కులతో పాటు శాటిలైట్ ఓటీటీ హక్కులను మొత్తంగా 100 కోట్లకు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ తమిళ హీరో కూడా ఈ స్థాయిలో డీల్ అయితే అందుకోలేదు. ఇక సూర్య కెరీర్ లో కూడా ఇది అతి పెద్ద రికార్డు. మరి ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.
Follow
Post a Comment