టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఓ కథ అనుకున్న తర్వాత అది నచ్చకపోవడంతో ముందు చేసిన షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకుని మరి మళ్ళీ కొత్త తరహా కథను సెట్స్ పైకి తీసుకువస్తున్నారు. ఇప్పటివరకు కొత్తగా అనుకున్న కథను ఇంతవరకు స్టార్ట్ చేయలేదు.
అసలైతే జనవరి మొదటి వారంలోనే త్రివిక్రమ్ మొదలు పెట్టాలని అనుకున్నాడు. కానీ మహేష్ బాబు న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్ళాడు. ఇక వచ్చిన తర్వాత సెకండ్ వీక్ లో అయినా తొందరగా మొదలు పెట్టాలని అనుకుంటే మహేష్ బాబు ఇంకాస్త ఆలస్యం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫైనల్ గా జనవరి 17వ తేదీన రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని త్రివిక్రమ్ టీమ్ అయితే డిసైడ్ అయింది. మరి మహేష్ ఆ డేట్ కైనా స్టార్ట్ చేస్తారో లేదో చూడాలి.
Follow
Post a Comment