ప్రాజెక్ట్ K: నైజాం డీల్ అన్ని కోట్లా?


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో భారీ యాక్షన్ ఫిల్మ్ గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇక ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. నిర్మాత అశ్విని దత్ ఇప్పటికే సినిమాకు సంబంధించిన నైజాం డీల్ క్లోజ్ చేసినట్లుగా తెలుస్తోంది.

ప్రముఖ ఏషియన్ అధినేత సునీల్ అలాగే దగ్గుపాటి సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమా నైజాం హక్కులను 70 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకా మిగతా ఏరియాలో రైట్స్ విషయంలో కూడా ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. ముందుగా అయితే నిర్మాత నైజాం డీల్ క్లోజ్ చేసి వారి నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా అయితే ప్రాజెక్ట్ K సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post