పవన్ OG.. ఈ గాసిప్స్ నిజమేనా?


పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న OG ప్రాజెక్టు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యి కొన్ని గంటలు కూడా కాకముందే ఈ ప్రాజెక్టుపై అనేక రకాల గాసిప్స్ అయితే పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ కేవలం 32 రోజులు కాల్షీట్స్ మాత్రమే ఇచ్చాడు అని అలాగే రెండు భాగాలుగా ఈ ప్రాజెక్టును తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా కూడా ఒక టాక్ అయితే వినిపించింది.

అంతేకాకుండా ఈ సినిమాకు DVV దానయ్య నిర్మాత అయినప్పటికీ కూడా మరో నిర్మాతగా అల్లు అరవింద్ బ్యాగ్రౌండ్ లో డబ్బులు ఇస్తున్నారు అని టాక్ వినిపిస్తోంది. ఇక మరోవైపు ఈ సినిమా లో టబు కీలకపాత్రలో నటిస్తోంది అని అలాగే మరొక సీనియర్ హీరోయిన్ కోసం కూడా సుజిత్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఎన్నెన్నో కథనాలు వెలబడుతున్నాయి. OG సినిమాలో ఫైట్స్ సాంగ్స్ ఉండవని కూడా అన్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఉంటాయని కూడా మరి కొంతమంది ఓజీ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇక ఈ సినిమా హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ కంటే ముందే రావచ్చని కూడా టాక్ వినిపిస్తోంది. ఫైనల్ గా ఈ గాసిప్స్ క్లారిటీ రావాలి అంటే సినిమా షూటింగ్ మొదలయ్యే వరకు కాస్త ఆగాల్సిందే.

Post a Comment

Previous Post Next Post