పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ఖుషి ఇటీవల ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రీ-రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు రాబట్టింది. అలాగే పవన్ మరో సూపర్ హిట్ చిత్రం తొలి ప్రేమ 2023 ఫిబ్రవరి మధ్యలో విడుదల కానుంది. అయితే పవన్ రాబోయే చిత్రం హరి హర వీర మల్లు అప్డేట్ కూడా వచ్చేసింది.
చిత్ర నిర్మాత AM రత్నం, పాన్ ఇండియన్ మూవీ టీజర్ ను జనవరి 26 విడుదల చేయనున్నట్లు సూచించాడు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అన్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో పవన్ ముడు విభిన్నమైన షేడ్స్ లో కనిపించనున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.
Follow
Post a Comment