గోపిచంద్ మలినేని.. మరో బిగ్ ఆఫర్!


డాన్ శీను సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన మాస్ కమర్షియల్ దర్శకుడు గోపీచంద్ మలినేని ఆ తర్వాత బాడీగార్డ్, బలుపు, పండగ చేసుకో, విన్నర్ క్రాక్ సినిమాలతో తన స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా క్రాక్ సినిమా అతనికి సరికొత్త బూస్ట్ ఇచ్చింది. ఇక ఇటీవల వచ్చిన వీర సింహారెడ్డి సినిమా కూడా పరవాలేదు అనిపించింది. 

దర్శకుడిగా అతను హీరోల రేంజ్ కు తగ్గట్టు సినిమాలను తీయగలడు అని నిరూపించుకున్నాడు. అయితే ఇప్పుడు గోపీచంద్ కు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతల నుంచి మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ అతడితో మరో సినిమా చేయడానికి కూడా అగ్రిమెంట్ చేసుకుంది. 

ప్రభాస్ తో డిస్కషన్ జరిగింది కానీ ఇప్పట్లో అయితే ఆ ప్రాజెక్టు రాకపోవచ్చు. ఇక అందుకే ఈ దర్శకుడు మరొక హీరో కోసం ఎదురు చూస్తున్నాడు. అలాగే మరొకవైపు హారిక హాసిని అనుబంధ సంస్థ సీతార ఎంటర్టైన్మెంట్స్ లో కూడా సినిమా చేసేందుకు గోపీచంద్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అయితే ఆ ప్రాజెక్టులో మాత్రం దాదాపు వెంకటేష్ హీరోగా ఫిక్స్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 

వెంకటేష్ కూడా మాస్ హై వోల్టేజ్ లో తులసి, లక్ష్మీ లాంటి మూవీ చేసి చాలా రోజులైంది. అందుకే గోపీచంద్ తో సినిమా చేయాలి అని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వెంకటేష్ 75వ సినిమాను శైలేష్ కొలనుతో చేయడానికి రెడీ అవుతున్నాడు. అంతేకాకుండా వీలైనంత త్వరగా గోపీచంద్ తో కూడా సినిమాను సెట్ చేసుకోవాలి అనే చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ కాంబినేషన్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post