నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య రెండు సినిమాలు కూడా మాస్ కమర్షియల్ పాయింట్స్ తో సంక్రాంతి విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల నుంచి సాంగ్స్ వరకు అన్నీ కూడా మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు. మాస్ మొగుడు, పూనకాలు లోడింగ్, మాస్ జాతర ఇలా అన్ని లైన్లు కూడా మాస్ ఆడియన్స్ ను ఫోకస్ చేస్తున్నాయి.
అయితే చిరంజీవి బాలయ్య ఇద్దరు కూడా ఈ సినిమాలతో సక్సెస్ సాధిస్తే భవిష్యత్తులో కొంత సమస్యగా కూడా మారవచ్చు. ఈ సినిమాలు రొటీన్ కమర్షియల్ పాయింట్స్ తో సక్సెస్ అయితే కనుక మళ్ళీ వీరి దగ్గరికి అలాంటి దర్శకులే ఎక్కువగా వస్తారు. ఇక ఆడియన్స్ మాస్ సినిమాలను ఎప్పుడు సక్సెస్ చేస్తారో ఎప్పుడు డిజాస్టర్ చేస్తారో తెలియని పరిస్థితి.
ఈ రోజులలో కొత్త తరహా కంటెంట్ ఉన్న కథలను ఎక్కువగా చూడాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ డిఫరెంట్ సినిమాలు చేయాలని కూడా ఓ వర్గం ఫ్యాన్స్ కోరుతున్నారు. కానీ చిరు బాలయ్య ఇద్దరు కూడా ఎక్కువగా రెగ్యులర్ సినిమాలతోనే వస్తున్నారు. మరి భవిష్యత్తులో వీరు మళ్లీ ఇదే తరహాలో వెళ్తారా లేదంటే ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తారా లేదా అనేది చూడాలి.
Follow
Post a Comment