Top News

HIT యూనివర్స్ లో స్టార్ హీరో (75)?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శైలేష్ కొలను హిట్ 1 సినిమా తర్వాత దానికి కొనసాగింపుగా తెచ్చిన హిట్ 2 సెకండ్ కేసు కూడా మంచి విజయాన్ని అందుకుంది. హీరోలు విశ్వక్ సేన్ అడవి శేష్ ఇద్దరూ కూడా ఈ యూనివర్స్ లో ఫిక్స్ అయిపోయారు. అంతేకాకుండా మూడవ పార్ట్ లో నాని అర్జున్ సర్కార్ గా రాబోతున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చారు.


అయితే ఈ యూనివర్స్ లో మరింత మంది స్టార్ హీరోలు ఉంటారు అని ఇదివరకే దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఒక స్టార్ హీరో సినిమా కూడా హిట్ మల్టీవర్స్ లో జాయిన్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ హీరో మరెవరు కాదు వెంకటేష్ అని తెలుస్తోంది. త్వరలోనే వెంకటేష్ 75వ సినిమాపై క్లారిటీ కి రావాలని అనుకుంటున్నాడు. అయితే హిట్ 2 సినిమాను చూసిన వెంకీ అతని టాలెంట్ ను నమ్మి పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post