పైసా ఖర్చు లేదు.. అన్‌స్టాపబుల్ ఆదాయం!

అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఈసారి మరింత హై రేంజ్ లో క్రేజ్ అందుకుంటోంది. ముఖ్యంగా ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ స్థాయిలో హైప్ పెరిగింది అంటే ఆహా ఓటీటీ ఫ్లామ్ కు ఆదాయం కూడా హై రేంజ్ లో ఉండి ఉంటుందని చెప్పవచ్చు. ప్రతీ ఎపిసోడ్ కు బ్రాండ్ కంపెనీలు మారతాయి, డీలింగ్స్ కూడా చేంజ్ అవుతాయి. ఇక ప్రభాస్ ఎపిసోడ్ కు మాత్రం కాస్త హై రేంజ్ ప్రాఫిట్స్ వచ్చినట్లు తెలుస్తోంది.


ప్రభాస్ ఎపిసోడ్ కోసం మొత్తం 9 టాప్ బ్రాండ్స్ ప్రమోషన్స్ ఇస్తున్నాయి. ఆహాకు మాన్షన్ హౌస్ అనేది అఫీషియల్ పాట్నర్ కాగా కో ప్రజెంటేడ్ బై, కో పవర్డ్ బై.. క్యాటగిరీలో మరో 8 కంపెనీలు ఉన్నాయి. ఇక ప్రొడక్షన్ ఖర్చు మొత్తం మాన్షన్ హౌస్ వాళ్లదే. అంతే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ కు వారితో మరో డీల్ కూడా ఉంటుంది. దాంతో పాటు మరో కంపెనీ పేమెంట్ కలిపితే అందులోనే బాలయ్య రెమ్యునరేషన్ కూడా వచ్చేస్తుంది.

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 2 కోసం 12 కోట్ల వరకు ఆదాయం అందుకునే ఛాన్స్ ఉంది. ఇక మిగతా కంపెనీల నుంచి వచ్చే ఆదాయం ప్రతీ ఎపిసోడ్ కు 3 నుంచి 4 కోట్లకు పైగానే ఉంటుంది. అంటే సీజన్ మొత్తంలో 10 ఎపిసోడ్స్ చేసినా 30 నుంచి 40 కోట్ల మధ్యలో ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే సబ్ స్క్రైబర్స్ పెడిగితే అదొక బోనస్. ఆహా నిజంగా పైసా ఖర్చు లేకుండా ప్రతీ సీజన్ లో ఊహించని రేంజ్ లో ఆదాయం అందుకుంటోందని చెప్పవచ్చు.

Post a Comment

Previous Post Next Post