పూరి జగన్నాథ్.. ఇక నమ్మేది ఏ హీరో?

 


డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుస అపజయాలు తర్వాత ఈస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ అయ్యారని అనుకుంటే ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారిగా లైగర్ సినిమాతో కోలుకోలేని దెబ్బ తిన్నారు. సినిమా ప్లాప్ అవ్వడమే కాకుండా ఊహించని స్థాయిలో నెగిటివ్ కామెంట్స్ ని కూడా అందజేసింది. అంతే కాకుండా సినిమా బిజినెస్ లో ఖర్చు చేసిన డబ్బు బ్లాక్ మనీ అనే విధంగా ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక మొదట ఛార్మి, పూరి ఈడీ విచారణకు వెళ్ళగా రీసెంట్ గా విజయ్ దేవరకొండ కూడా వెళ్ళక తప్పలేదు.


ఈ కేసు వివాదంపై ఇప్పటివరకు పూరి జగన్నాథ్ టీమ్ ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. అయితే ఇప్పుడు పూరి భవితవ్యం కూడా సందిగ్ధంలో పడినట్లయింది. అతను సినిమాలు చేయాలని అనుకుంటే ఏ హీరో నమ్ముతారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి వివాదాలు లుసుగులు ఇండస్ట్రీలో కామన్ అయినప్పటికీ బయటపడనంత వరకే ఏదైనా. ఇక ఇప్పుడు పూరి ఫోకస్ అయ్యాడు కాబట్టి ప్రొడక్షన్ ను నమ్మి సినిమా చేసేందుకు అగ్ర హీరోలు సినిమా చేసేందుకు వెనుకడుగు వేస్తారు. అసలే ఫ్లాప్ లో ఉన్న పూరికి ఇప్పుడు ఈడీ గోల మరింత టెన్షలో పెట్టింది. మరి ఈ సమస్యల నుంచి ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post