పవన్ - సుజిత్.. ఆ సినిమా స్టైల్ లోనే?

 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సాహో దర్శకుడు సుజిత్ సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. డివివి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్ గా వస్తున్న టాక్ ప్రకారం. దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో దారుణంగా డిజాస్టర్ అయినాక సినిమా స్టైల్ లోనే తన కొత్త సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది.


2011లో విష్ణువర్ధన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేసిన పంజా సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఆ సినిమాకు మాత్రం ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఇప్పుడు సుజిత్ రాసుకున్న కథ కూడా అండర్ గ్రౌండ్ మాఫియా నేపథ్యంలోనే ఉంటుందట. పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా గన్స్ తో ఊచకోత కోసే సీన్స్ కూడా ఇందులో హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. కంప్లీట్ యాక్షన్ డ్రామాగా ఉండబోయే సినిమా కథ కోసం దాదాపు ఏడాదిన్నర పాటు సుజిత్ వర్క్ చేశాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post