ఠాగూర్ మూవీ లైన్ లో పవన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. హరిష్ శంకర్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమా తేరి తమిళ మూవీకి రీమేక్ గా రాబోతున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే దర్శకుడు హరీష్ ఒరిజినల్ కథకు తగ్గట్టుగా కాకుండా కొంత మార్పులు చేయాలని అనుకుంటున్నాడట.


అయితే ఒరిజినల్ కథలో హీరో ఒక బేకరీ ఓనర్ గా ఉండగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం మరొక పాత్రలో కనిపిస్తాడట. మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ సినిమా తరహాలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒక లెక్చరర్ పాత్రలో కనిపిస్తూ అన్యాయం చేసే వారిపై తిరగబడతాడని తెలుస్తోంది. అంతేకాకుండా తన స్టూడెంట్స్ కు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా వారిని మారుస్తూ ఉంటాడట. మెగాస్టార్ చిరంజీవి అయితే ఠాగూర్ సినిమాతో ఒక రేంజ్ లో సక్సెస్ అందుకున్నాడు. మరి ఇప్పుడు దాదాపు అదే తరహా లైన్ తో రాబోతున్న పవర్ స్టార్ ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post