బాలయ్య, చిరు.. సంక్రాంతి రికార్డులు!

నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి మొత్తం తొమ్మిది సార్లు సంక్రాంతి ఫెస్టివల్స్ లో వారి సినిమాలతో పోటీపడ్డారు. ఇప్పుడు వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి సినిమాలతో పదవ సారి పోటీ పడబోతున్నారు. ఇక ఇంతకుముందు పోటీలో ఎవరి సినిమా సక్సెస్ అయ్యింది అనే వివరాల్లోకి వెళితే.


1985లో మొదటిసారి చిరంజీవి చట్టంతో పోరాటం అనే సినిమాతో రాగా బాలకృష్ణ ఆత్మబలం సినిమాతో వచ్చాడు. చట్టంతో పోరాటం సక్సెస్ కాగా.. ఆత్మబలం సినిమా యావరేజ్ టాక్ అందుకుంది.

రెండవసారి 1987లో చిరంజీవి దొంగ మొగుడు సినిమా సక్సెస్ కాగా బాలకృష్ణ భార్గవ రాముడు డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది.

1988లో చిరంజీవి మంచి దొంగ కూడా సక్సెస్ అయింది. ఇక నందమూరి బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ యావరేజ్ ఫిలిం గా నిలిచింది.

1997లో చిరంజీవి హిట్లర్ సినిమా తో పాటు బాలకృష్ణ పెద్దన్నయ్య సినిమా కూడా మంచి సక్సెస్ టాక్ ను అందుకున్నాయి.

1999లో స్నేహం కోసం సినిమాతో చిరంజీవి యావరేజ్ టాక్ అందుకోగా నందమూరి బాలకృష్ణ సమరసింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అనుకున్నాడు.

2000వ ఏడాదిలో చిరంజీవి అన్నయ్య సినిమా సూపర్ హిట్ అవ్వగా బాలకృష్ణ వంశోద్ధారకుడు అంతగా సక్సెస్ కాలేక పోయింది.

2001లో నరసింహనాయుడు సినిమాతో బాలకృష్ణ మరో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకోగా మెగాస్టార్ చిరంజీవి మృగరాజు మాత్రం డిజాస్టర్ అయ్యింది.

2004లో బాలకృష్ణ లక్ష్మీనరసింహ సక్సెస్ టాక్ అందుకోగా.. చిరంజీవి అంజి సినిమా మాత్రం ఫెయిల్యూర్ గా నిలిచింది.

2017లో ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు రెండు ఒకేసారి వచ్చాయి. రెండు సినిమాలకు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. మరి 2023 సంక్రాంతికి ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post