నాగచైతన్య కోసం వెంకీ మామ కూతురు!

 


అక్కినేని నాగచైతన్య కేవలం సినిమాలతోనే కాకుండా ప్రత్యేకంగా ఒక వ్యాపారం కూడా కొనసాగిస్తున్నాడు. జపనీస్ స్టైల్ లో ఉండే కొన్ని ప్రత్యేకమైన వంటకాలు ఆన్లైన్ ద్వారా డెలివరీలో చేస్తూ ఉన్నారు. తన స్నేహితులతో కలిసి నాగచైతన్య మాదాపూర్ లో :షోయు' అనే కిచెన్ ఏర్పాటు చేశారు. త్వరలోనే హైదరాబాద్లోనే వివిధ ప్రాంతాల్లో కూడా మరికొన్ని కిచెన్స్ ఏర్పాటు చేసి తన వ్యాపారాన్ని మరింత విస్తరింప చేసుకోబోతున్నాడు.


అయితే ఇటీవల నాగచైతన్య బిజినెస్ కోసం ఆయన మరదలు కూడా ప్రమోషన్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్టార్ హీరో వెంకటేష్ పెద్ద కూతురు అయిన ఆశ్రిత దగ్గుబాటి ఫుడ్ వ్లాగ్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.  ఆమె "ఇన్ఫినిటీ ప్లాటర్" పేరుతో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్ వ్లాగ్స్ చేస్తుంది. ఇక ఇటీవల ఆమె తన 'బావ' నాగ చైతన్య యొక్క క్లౌడ్ కిచెన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Post a Comment

Previous Post Next Post