ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న బుచ్చి బాబు ఇప్పుడు రామ్ చరణ్ తో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ 250 కోట్ల నుంచి 300 కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు డిఫరెంట్ యాక్షన్ ఫిల్మ్ గా సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకు రాబోతోంది.
అయితే ఈ సినిమాకు బుచ్చిబాబు రెమ్యునరేషన్ 20 కోట్లు మాత్రమే అని తెలుస్తోంది. ఉప్పెనతో 100 కోట్ల బిజినెస్ ను క్రియేట్ చేసిన బుచ్చిబాబుకు ఈ నెంబర్ ఇప్పుడున్న బడ్జెట్ లెక్కలతో పోలిస్తే తక్కువే. రామ్ చరణ్ తో పాన్ ఇండియా సినిమా కాబట్టి ఎంత కాదనుకున్నా నాన్ థియేట్రికల్ గానే 150 నుంచి 170 కోట్ల బిజినెస్ ఏర్పడుతుంది. ఇక థియేట్రికల్ లెక్క 200 కోట్లు దాటవచ్చు. దాదాపు 350 కోట్లకు పైగానే బిజినెస్ చేస్తుంది. కాబట్టి దర్శకుడికి 50 కోట్లయిన ఇవ్వాలి. మరి సక్సెస్ అయితే ప్రాఫిట్ లో షేర్ ఇస్తామనే ఒప్పందం ఏదైనా కుదుర్చుకున్నారో లేదో చూడాలి.
Follow
Post a Comment