ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రీ-సేల్ బుకింగ్‌లతో, అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ కొన్ని రికార్డును బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో సినిమా ఇండియాలో 15 కోట్ల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇండియాలో టాక్ ను బట్టి ఈ సినిమా గత హాలీవుడ్ సినిమాల రికార్డును బ్రేక్ చేసే అవకాశం కూడా ఉంది.
ఇక ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న హాలీవుడ్ మూవీస్ ఇవే..
*అవేంజర్స్ ఎండ్ గేమ్ (2019) - గ్రాస్ 373 కోట్లు
*అవేంజర్స్ ఇన్ఫినిటీ వార్ (2018) - గ్రాస్ 227.43 కోట్లు
*స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ (2021) - గ్రాస్ 217 కోట్లు
*ది జంగిల్ బుక్ (2016) - గ్రాస్ 118 కోట్లు
*ది లయన్ కింగ్ (2019) - గ్రాస్ 158 కోట్లు
అవెంజర్స్ ఎండ్ గేమ్‌ను అధిగమించడానికి మొదటి రోజు అత్యధిక గ్రాసర్‌గా నిలవాలంటే అవతార్ 2 భారతదేశంలో కనీసం 54 కోట్లు వసూలు చేయాలి.
అవతార్ పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా 2.749 బిలియన్ డాలర్లు (రూ. 18957 కోట్లు) సంపాదించింది. 10 సంవత్సరాల తర్వాత, ఎవెంజర్స్ ఎండ్‌గేమ్ విడుదలైన రెండు నెలల్లో 2.75 బిలియన్లు (రూ. 19025 కోట్లు) సాధించింది. మరి అవతార్ 2 ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.
Follow
Post a Comment