కథ
యశోద (సమంత) అద్దెగర్భం వలన ఒక ఆసుపత్రిలో చేరుతుంది. సరోగసీ మహిళలకు ఒక దగ్గర ప్రపంచ స్థాయి సంరక్షణను అందిస్తుంటారు. అయితే అక్కడ అనుకున్నంతగా పరిస్థితులు బాగుండవు. అదే విధంగా మహిళలు ఒక్కొక్కరుగా కనుమరుగవుతున్నారు. అనుకోకుండా ఒక మిస్టరీతో యశోద జీవితం మారిపోతుంది? అసలు వచ్చిన సమస్యతో ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది? అసలు మధు (వరలక్ష్మి శరత్‌కుమార్) ఎవరు? ఆసుపత్రి లోపల అలాగే వెలుపల మరణాలకు సంబంధం ఏంటి? అనేది సినిమాలోని అసలు కథాంశం..
విశ్లేషణ
హరి-హరీష్ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ ఫోకస్ అంతా యాక్షన్ వైపు మళ్లుతుంది. యశోధ రెండు వేర్వేరు సబ్‌ప్లాట్‌లలో మిస్టరీ మర్థర్స్ ద్వారా అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఉత్తేజకరమైన నోట్‌తోనే ప్రారంభమవుతుంది. అయితే సమంత ప్రమేయం ఉన్న ప్రధాన స్టోరీ తరువాత మిగతా కంటెంట్ అంతగా వర్కౌట్ కాలేదు. సినిమాలో రైటింగ్ లో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే సన్నువేశాలకు మరింత బలం చేకూరేది. కామెడీ యాంగిల్ అంతగా వర్కౌట్ కాలేదు. ప్రొడక్షన్ డిజైన్ మాత్రం చాలా బాగుంది.
కథలో వివిధ రకాల పాయింట్స్ ను అసలు కథ ట్రాక్ లోకి రావడానికి చాలా సమయం పడుతుంది. అక్కడక్కడా కొన్ని థ్రిల్లింగ్ అంశాలు మాత్రం బాగానే ఆకట్టుకున్నాయి. ప్రీ-ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ కు కొంత ఆసక్తి పెరుగుతుంది. ఇక ట్విస్ట్ లు మాత్రం అంతగా కొత్తగా ఏమి అనిపించవు. చాలా సీన్స్ ముందుగా ఊహించినట్లే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సెకండ్ హాఫ్ పై కొంత హైప్ అయితే పెంచేలా ఫస్ట్ హాఫ్ ను తెరకెక్కించారు.
రెండు ఫ్లాష్‌బ్యాక్‌లు అలాగే ట్విస్ట్ పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు. స్క్రీన్‌ప్లే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సింది. కథ బ్యాక్‌స్టోరీ, పెద్ద ట్విస్ట్ ఆశించిన ప్రభావాన్ని చూపలేదు. ఒక సీరియస్ సీన్ కొనసాగినప్పుడు దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది అని ఆడియన్స్ లో ఒక నమ్మకాన్ని కలగజేసిన దర్శకులు దానికి సమాధానం చెప్పే సమయంలో మాత్రం నిరాశను కలిగించారు.
సినిమాలో సెకండ్ హాఫ్ లో సమంత యాక్షన్ సన్నివేశాలు కనిపించిన విధానం ఇలా పలు అంశాలలో యశోద సినిమా బాగానే మెప్పించింది. ఇక ఇతర సెట్టింగ్స్ కూడా ఈ సినిమా కథకు కొంత బలాన్ని చేకూర్చాయి. అయితే యశోద ఎన్నో ఆపదలను ఎదుర్కొని అన్ని కష్టాల తర్వాత క్లైమాక్స్ సింపుల్ సిల్లీ నోట్‌తో ముగించడం కూడా ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్ గా చెప్పవచ్చు. ఫైనల్ గా యశోద సినిమా కొన్ని కొన్ని సన్నివేశాలతో బాగానే ఆకట్టుకుంది. కానీ పూర్తిస్థాయిలో ఈ సినిమా థ్రిల్లింకు మాత్రం గురి చేయలేకపోయింది. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ తన పాత్రకు న్యాయం చేయగా ఉన్ని ముకుందన్ ఎప్పటిలానే రొటీన్ పాత్రలో కనిపించాడు. ఇక మణిశర్మ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పరవాలేదు అనిపిస్తుంది. ఇక ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్
👍సమంత పాత్ర
👍కథ నేపథ్యం
మైనస్ పాయింట్స్
👎రొటీన్ డ్రామా
👎ఊహించే సీన్స్, ట్విస్టులు
👎క్లయిమ్యాక్స్
రేటింగ్: 2.5/5
Follow
Post a Comment