సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలలో 350 కు పైగా సినిమాలు చేశారు. అయితే ఇప్పటికి కూడా ఎవరు అందుకోలేని విధంగా ఆయన ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా అందరికంటే ఎక్కువగా 80 మల్టీస్టారర్ సినిమాలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఈ రేంజ్ లో మల్టీ స్టారర్ సినిమాలు చేసిన కృష్ణ ఇండస్ట్రీలో బేధాలు లేకుండా ఎలా ఉండేవారో అర్థమవుతుంది.
సీనియర్ ఎన్టీఆర్ తో పాతాళ భైరవి, స్త్రీ జన్మ, దేవుడు చేసిన మనుషులు ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేయగా ఏఎన్ఆర్ తో మంచి కుటుంబం, గురు శిష్యులు, ఊరంతా సంక్రాంతి, రాజకీయ చదరంగం అనే సినిమాలు చేశారు. ఇక కృష్ణంరాజుతోనే అత్యధికంగా 19 సినిమాలు చేశారు. ఇక శోభన్ బాబుతో 13 సినిమాలు, మోహన్ బాబుతో నాలుగు సినిమాలు చేసిన కృష్ణ ఇతర ఇండస్ట్రీ హీరోలతో కూడా మంచి సినిమాలు చేశారు.
కాంతారావు తోనే మూడు సినిమాలు చేసిన ఆయన శివాజీ గణేషన్తో మూడు సినిమాలు, రజనీకాంత్ మూడు సినిమాలు చేశారు. ఇక ఆ తర్వాత తరం చిరంజీవి బాలకృష్ణ నాగార్జునలతో కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించారు. రవితేజతో చివరగా బలాదూర్ సినిమాలో పెదనాన్న పాత్రలో కనిపించిన కృష్ణ తన ఇద్దరు కొడుకులతో కూడా సినిమాలు చేశారు. ఇక ఎక్కువగా మహేష్ బాబుతో 7 సినిమాల్లో నటించగా రమేష్ బాబుతో 5 సినిమాల్లో నటించారు. ఇక ఒసేయ్ రాములమ్మ సినిమాలో కూడా ఆయన ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.
Follow
Post a Comment