కృష్ణ గారి ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సూపర్ స్టార్ కృష్ణ దాదాపు అన్ని తరహా జనార్స్ ను టచ్ చేసి ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయ్యారు. ఇక ఆయన తేనె మనసులు సినిమా ద్వారా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో మొదటిసారి వెండితెరకు పరిచయమయ్యారు.


1965 లో వచ్చిన తేనె మనసులు సినిమా ఆడిషన్స్ కోసం వచ్చిన కొంతమంది ఆ తర్వాత హీరోలు కూడా అయ్యారు. కానీ ఆ సినిమాకు కృష్ణ గారే కరెక్టుగా సెట్ అవుతారని సెలెక్ట్ చేశారు. అయితే ఆ సినిమా కోసం కృష్ణ గారు అందుకున్న మొదటి రెమ్యునరేషన్ రూ.2000 మాత్రమే. సక్సెస్ వచ్చినా కూడా ఆయన దాదాపు 40 సినిమాల వరకు 5000 కంటే కూడా ఎక్కువగా పారితోషికం పెంచలేదు. ఈ విషయాన్ని కృష్ణ ఒక ఇంటర్వ్యూలో టెకీయజేశారు

ఆయనను ఎక్కువగా నిర్మాతల మనిషి అంటూ ఉంటారు. కొన్నిసార్లు నిర్మతలు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ఆయన సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ నిర్మాతగా మారిన తర్వాత చిత్ర పరిశ్రమలో అప్పట్లో స్టాఫ్ అందరికీ కూడా మొదటగా నాన్ వెజ్ పెట్టించిన నిర్మాత కూడా ఆయనే. ఫ్యాన్స్ కు కూడా భోజనాలు పెట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Post a Comment

Previous Post Next Post