కృష్ణ మృతికి కారణం.. ఫలితం ఉండదని తెలుసు: వైద్యులు

 


సూపర్ స్టార్ కృష్ణ మృతి పై వైద్యులు ఒక వివరణ ఇచ్చారు. ఆదివారం రోజు రాత్రి గుండెపోటు కారణంగా ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత వెంటనే సిపిఆర్ చేసి ఐసియుకి తరలించారు. ఆయనకు గ్యాప్ లేకుండా చికిత్స అందిస్తూ వచ్చారు. హాస్పిటల్ కి వచ్చినప్పటి నుంచే ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ఇక మూడు గంటల తర్వాత పరిస్థితి మరింత విషయంగా మారింది ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులకు పరిస్థితి గురించి చెబుతూనే ఉన్నాము.. అని కాంటినెంటల్ డాక్టర్స్ అన్నారు.


వైద్యులు మాట్లాడుతూ.. ఇక సమయం గడుస్తున్న కొద్ది ఆయన అవయవాలు కూడా పనిచేయడం మానేశాయి. ఇక ఆ తర్వాత డయాలసిస్ కూడా చేయాల్సి వచ్చింది. సోమవారం సాయంత్రం పరిస్థితి మరింత క్రిటికల్ గా మారింది. అప్పుడే ఎలాంటి చికిత్స చేసినా కూడా ఫలితం దక్కదని అర్థమైంది. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించాము. ఇక ఆయనకు ఇబ్బంది కలగకుండా చివరి కొన్ని గంటలు మనశ్శాంతిగా వెళ్లిపోయేలా చేయాలి అని వైద్యులు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చివరికి గుండెపోటు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా కృష్ణ గారు తెల్లవారుజామున 4:09 నిమిషాలకు తుది శ్వాసను విడిచారు అని కృష్ణ గారు చాలా ఉన్నతమైన గొప్ప మనిషి ఆయన భౌతిక గాయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించాము.. అని వైద్యులు వివరణ ఇచ్చారు.

Post a Comment

Previous Post Next Post