సూపర్ స్టార్ కృష్ణ స్టార్ హీరోగా 350 కు పైగా సినిమాలు చేయడమే కాకుండా అందులో చాలా వరకు కొన్ని హిట్ సినిమాలని సొంత ప్రొడక్షన్ లోనే నిర్మించారు. ఇక ఆయన కొన్ని సినిమాలతో భారీ స్థాయిలో లాభాలు అందుకున్నారు. అయితే సినిమా ప్రొడక్షన్ లో ఎప్పటికైనా రిస్క్ అని తెలిసి కృష్ణ కొంత డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడే ల్యాండ్స్ కొనుగోలు చేయడం స్టార్ట్ చేశారు.
సినిమా పరిశ్రమ చెన్నై లో ఉన్నప్పుడే కృష్ణ శోభన్ బాబు తరహాలోనే ల్యాండ్స్ పై పెట్టుబడులు పెట్టారు. ఇక హైదరాబాద్ లో కూడా అదే తరహాలో భూములు కొనుగోలు చేశారు. ఇక వందల కోట్లు ఆస్తులు ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు అయ్యాయి. అయితే కృష్ణ గారు పిల్లలు పెద్దవారు అయినప్పుడు పెళ్లి చేసుకొని ప్రత్యేకంగా లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు సమానంగా ఆస్తి పంపకాలు చేశారు. ఎలాంటి వివాదాలు లేకుండా ముగ్గురు కుతుళ్ళకు ఇద్దరు కొడుకులకు సమానంగా ఆస్తి పంపకాలు జరిగాయి. కొడుకులకు ఎక్కువ కుతుళ్ళకు తక్కువ అని విబేధాలు చూపలేదు. ఇక నానక్ రామ్ గుడాలో ఉన్న ఒక ఇల్లు మాత్రమే చివరగా ఆయన పేరు మీద ఉంది. ఇక దాన్ని కూడా సమానంగా తీసుకునేలా వీలునామా రాసినట్లు తెలుస్తోంది.
Follow
Post a Comment