టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గారి ఆరోగ్యం పై ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే గత 15 రోజులుగా ఆయన వైద్యుల సమక్షంలో కొంత ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని.. 79 సంవత్సరాల వయసులో ఉన్న కృష్ణ గారు ఇటీవల కొంత అస్వస్థత వలన హాస్పిటల్లో చేరారని ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ విషయంలో అభిమానులు కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇక వెంటనే అప్డేట్ ఇవ్వాలి అని కూడా కోరగా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. సూపర్‌స్టార్ కృష్ణ గారి ఆరోగ్యం నిలకడగా వుందని జనరల్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్లారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నేడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని కూడా విజయ నిర్మల తనయుడు, నటుడు నరేష్ తెలియజేశారు. అలాగే ఫ్యాన్స్ అధినేతలకు కూడా ఈ విషయాన్ని చెప్పారు.
Follow
Post a Comment