RRR తరువాత రాజమౌళి తెరపైకి తీసుకు రానున్న మహేష్ బాబు 29వ సినిమాపై అంచనాలు ఏ తరహాలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ పై రాజమౌళి అప్పుడప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా జక్కన్న మరో క్లారిటీ అయితే ఇచ్చాడు.
రాజమౌళి మాట్లాడుతూ.. రీసెంట్ గా SSMB 29 కథను రాయడం స్టార్ట్ చేశాము. నా సినిమాలకు ఎక్కువగా భాగం మా నాన్న గారు, మా కజిన్ (కాంచి) కథ రచయిగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం నుంచే కథకు సంబంధించిన కోర్ పాయింట్ ను కూడా నేను నా టీమ్ అందరం కూడా డెవలప్ చేశాము. ఇదొక అడ్వెంచర్ స్టోరీ. చాలా కాలంగా నేను ఇలాంటి కథతో సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఇండియానా జోన్స్ నాకు ఇష్టమైన సినిమాల్లో ఒకటి. గ్లోబల్ కాన్సెప్ట్ లోనే ఒక బిగ్ అడ్వెంచర్ సినిమా చేయాలని ఉంది. వీలైనంత త్వరగా రైటింగ్ పనులు ఫినిష్ అవుతాయి.. అని రాజమౌళి వివరణ ఇచ్చారు.
Follow
Post a Comment