శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఏషియన్ సునీల్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల కొన్ని నిజ జీవితంలోనే సంఘటనలు ఆధారంగా తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇండియాలో జరిగిన అతిపెద్ద స్కాం నేపథ్యంలో ఈ సినిమా అసలు కథ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఆ కథలోనే ఒక లవ్ స్టొరీ కూడా ఉంటుందట. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. దర్శకుడు పూర్తిగా ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్న తర్వాతనే సినిమా చేయడానికి ధనుష్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కోసం ధనుష్ రెండు భిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. శేఖర్ మొదటిసారి కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక కథకు తగ్గట్లుగా సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఒక బలమైన విలన్ కనిపిస్తారని సమాచారం.
Follow
Post a Comment