ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో చాలా సింపుల్ గా ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ తర్వాత మహానటి సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు అతను ప్రభాస్ తో పాన్ వరల్డ్ సినిమా ప్రాజెక్ట్ K ను తెరపైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ విషయంలో మాత్రం చిత్ర యూనియ్ ఆలస్యం చేస్తోంది.
ఒక విధంగా ఆలస్యానికి కారణం.. సినిమా విడుదలకు ఇంకా చాలా ఎక్కువ సమయం ఉండడమే. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రాజెక్టు K లో ప్రతిదీ కొత్తగా ఉండబోతుంది అని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలియజేశాడు. సాధారణంగా ఈ సినిమాకు ప్రతిదీ కూడా మేమే తయారు చేసుకోవాల్సిందే, ఇందులో కారు సరికొత్త టెక్నాలజీతో ఉండేలా చేసుకున్నాము. మళ్ళీ దాన్ని కూడా మేమే రెడీ చేసుకోవాల్సి వచ్చింది.. అని నాగ్ అశ్విన్ చెప్పాడు. ఒక విధంగా ఈ ప్రాజెక్ట్ K అనుకున్నప్పుడు ఇలా ఎలా తెరపైకి తీసుకురావాలి అని ఆలోచనలోనే.. ఎక్కువ సమయం పట్టింది అని.. దర్శకుడు వివరణ ఇచ్చాడు. ఇక మహీంద్రా కంపెనీతో ప్రత్యేకంగా కార్ల కోసమే ఒక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
Follow
check: sidhika-sharma-hot
ReplyDeletePost a Comment