ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్న ప్రొడక్షన్ లలో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. అయితే ఈ సంస్థలో రూపొందుతున్న మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి రెండు కూడా సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. ఒక విధంగా నిర్మాతలకు ఇది పెద్ద టాస్క్ అని చెప్పాలి.
అసలు అయితే మొదట ఈ రెండు సినిమాల మధ్య క్లాష్ ఉండకూడదు అని అనుకున్నారు. కానీ అనుకోని విధంగా సంక్రాంతికి విడుదల తేదీలను ఫిక్స్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మొట్టమొదటగా వీళ్ళు ప్రమోషన్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ క్లాష్ ఉండకూడదు అని ఫిక్స్ అయ్యారు. అందుకే ఒకరోజు వాల్తేరు వీరయ్య సాంగ్ విడుదల చేస్తే మరొక రోజు గ్యాప్ ఇచ్చి వీర నరసింహ రెడ్డికి సంబంధించిన సాంగ్ విడుదల చేస్తున్నారు. వేటికవే పోటీ అనే విధంగా ఉండాలి అని మైత్రి మూవీ మేకర్స్ బ్యాలెన్స్ తో ప్రమోషన్స్ చేసే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ పోటీ నడుమ ఏ సినిమా వారికి బాక్సాఫీస్ వద్ద అత్యధిక స్థాయిలో ప్రాఫిట్స్ అందిస్తుందో చూడాలి.
Follow
Post a Comment