టాలీవుడ్ హీరో నాగచైతన్య సోలోగా తన ద్వారా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న దాఖలాలు లేవు. రామ్ చరణ్ తరహా లోనే అతనికి కూడా రంగస్థలం లాంటి ఒక సక్సెస్ పడితే గాని బాక్సాఫీస్ దగ్గర సోలో రేంజ్ పెరిగే ఛాన్స్ లేదనిపిస్తోంది. ప్రతిసారి కూడా డైరెక్టర్ లేదా హీరోయిన్ కాంబినేషన్ ద్వారానే అతని సినిమాలకు ఒక హైప్ అయితే క్రియేట్ అవుతుంది.
చివరగా వచ్చిన థాంక్యూ సినిమా డిజాస్టర్ ద్వారా ఆ విషయం క్లారిటీగా అర్థమయింది. ఆ సినిమాకు నిర్మాత దిల్ రాజు చాలా వరకు నష్టపోయాడు. అయితే ఇప్పుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న కమర్షియల్ యాక్షన్ మూవీ మీద కూడా నిర్మాతలు గట్టిగానే పెట్టుబడి పెడుతున్నారు. దాదాపు 20 కోట్లకు పైగానే ఆ సినిమా బడ్జెట్ పెరిగినట్లుగా తెలుస్తోంది. అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇటీవల మొదలు పెట్టిన యాక్షన్ సన్నివేశాల కోసం మూడు నుంచి నాలుగు కోట్ల మధ్యలో ఖర్చయినట్లు తెలుస్తోంది. మరి నాగచైతన్య ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
Follow
Post a Comment