HIT 3: ముగ్గురు స్టార్స్.. యూఎస్ బ్యాక్ డ్రాప్

 


హిట్ సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరోక సీక్వెల్ హిట్ 2 సెకండ్ కేస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది  డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతొంది. ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈసారి అడివి శేష్ ఏ విధంగా కట్టుకుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది.


అయితే నాని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక మూడవ కేసుగా హిట్ 3 కూడా త్వరలోనే సెట్స్ పైకి రానందుని తెలుస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం. ముగ్గురు స్టార్స్ తో అమెరికా బ్యాక్ డ్రాప్ లో శైలేష్ కొలను సరికొత్తగా ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతిని ఫిక్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇక నాని, అడివి శేష్, విజయ్ సేతుపతితో ఈసారి యాక్షన్ డోస్ కూడా హైలో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. మరి ముగ్గురు స్టార్స్ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post