రెమ్యునరేషన్.. అతిగా ఆశపడని బాలయ్య!

 

ఇటీవల కాలంలో చాలా మంది హీరోలు వారి మార్కెట్ను పెంచుకుంటున్న విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కేవలం థియేట్రికల్ గానే కాకుండా డిజిటల్ శాటిలైట్ ద్వారా కూడా వారి పారితోషికాలు అమితంగా పెరుగుతున్నాయి. అయితే థియేట్రికల్ గా కొన్నిసార్లు ఊహించని విధంగా లాభాలు వస్తే హీరోలు అందులో వాటా కూడా అడుగుతూ ఉండడం విశేషం. అలా కావాలి అంటే ముందే పారితోషికం విషయంలో మాత్రం కొంత రాజీ పడుతూ లాభాల్లో వాటా అందుకోవాల్సి ఉంటుంది.


ఒకవేళ సినిమా లాస్ అయితే మాత్రం ఎలాంటి లాభం రాదు. ప్రస్తుతం ఉన్న చాలా మంది హీరోల్లో ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. అయితే నందమూరి బాలకృష్ణ మాత్రం ఆ తరహా గొడవల్లో అసలు ఉండడం లేదు. రిజల్ట్ తో సంబంధం లేకుండా ముందుగానే రెమ్యూనరేషన్ గురించి ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ముందుగానే నిర్మాతతో మాట్లాడుకునే ఆయన రెమ్యునరేషన్ తీసుకొని సినిమా ఫినిష్ చేస్తున్నాడు. అఖండ సినిమాకు 12 కోట్ల లోపే రెమ్యునరేషన్ తీసుకున్న బాలయ్య ఇప్పుడు 17 నుంచి 20 కోట్ల మధ్యలో అందుకుంటున్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post