అక్కినేని నాగార్జున ఇటీవల వరుస సినిమాలతో నిరాశపరిచాడు. రీసెంట్ గా వచ్చిన ది ఘోస్ట్ సినిమా అయితే దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఇక ప్రస్తుతం ఆయన తదుపరి కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాడు. ఇటీవల గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు టాక్ వచ్చింది. అయితే గాడ్ ఫాదర్ తో అంతగా సక్సెస్ కాలేకపోయిన మోహన్ రాజా ఆ ఛాన్స్ పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఇక నాగ్ ఇప్పుడు జబర్దస్త్ రైటర్ కు దర్శకుడిగా ఆఫర్ ఇచ్చినట్లు మరో కొత్త టాక్ వస్తోంది. ఆ రైటర్ మరెవరో కాదు జబర్దస్త్ షో రైటర్ గా గుర్తింపు అందుకున్న ప్రసన్న కుమార్ అని తెలుస్తోంది. ఈ రైటర్ ఇంతకుముందు జబర్దస్త్ షో తరువాత సినిమా చూపిస్తా మావ, నేను లోకల్ అనే సినిమాలతో రైటర్ గా వర్క్ చేశాడు. ధమాకా సినిమాకు కూడా అతనే రైటర్. అయితే ఇటీవల ప్రసన్న కుమార్ దర్శకుడిగా మారాలని చెప్పిన ఒక కథకు నాగ్ పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబినేషన్ పై అధికారికంగా క్లారిటీ రానుంది.
Follow
Post a Comment