షూటింగ్ లో నాగశౌర్యకు అస్వస్థత

టాలీవుడ్ హీరో నాగ శౌర్య షూటింగ్లో పాల్గొంటూ ఉండగా కొంత అస్వస్థతగు గురైనట్లుగా తెలుస్తోంది. అతను షూటింగ్ చేస్తుండగా హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోవడంతో అక్కడే ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా టెన్షన్ పడిపోయారు. ఇక అతన్ని సన్నిహితులు వెంటనే గచ్చిబౌలి AIG హాస్పిటల్ లో జాయిన్ చేశారు.


వైద్యుల పర్యవేక్షణ తర్వాత వెంటనే నాగశౌర్య కోలుకున్నాడు. డిహైడ్రేషన్ కారణంగానే అతను కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా వైద్యులు చెప్పడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా నాగశౌర్య తీరికలేకుండా షూటింగ్లో పాల్గొనడం వల్లనే ఈ విధంగా సొమ్మసిల్లి పడిపోయినట్లుగా తెలుస్తోంది. నవంబర్ 21వ తేదీన అతను పెళ్ళికొడుకు కాబోతున్న విషయం తెలిసిందే. బెంగళూరులో అనుషతో నాగశౌర్య పెళ్లి జరగనుంది.

Post a Comment

Previous Post Next Post