మసూద వీకెండ్ కలెక్షన్స్.. మైండ్ బ్లోయింగ్

 


మంచి కంటెంట్ తో సినిమాలు వస్తే చూడడానికి జనాలు థియేటర్స్ వరకు వస్తారు అని చాలాసార్లు రుజువు చేశారు. అలాగే చిన్న పెద్ద అని తేడా కూడా ఉండదు అని రుజువయింది. ఇక ఇప్పుడు పెద్దగా స్టార్ క్యాస్ట్ లేని మసూద అనే చిన్న సినిమా కూడా అదే తరహాలో రెస్పాన్స్ అందుకుంటుంది. హారర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే కొంత పాజిటివ్ టాక్ అందుకొని కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్ళింది. ఇక శనివారం కూడా మొదటి రోజు కంటే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది.

ఆదివారం రోజు అయితే మరింత ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మొదటిరోజు 70 లక్షల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న ఈ హారర్ మూవీ ఆ తర్వాత రోజు 90 లక్షలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇక మూడవరోజు సండే అయితే 1 కోటి 40 లక్షలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. అంటే మొదటి వారాంతరంలో ఈ సినిమా 1.70 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. మొత్తంగా మసూద సినిమా 1.3 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేయగా ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో షేర్ కలక్షన్స్ అందుకుంది. బాక్సాఫీస్ ట్రేడ్ లెక్కల ప్రకారం ప్రస్తుతం 30 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ తో కొనసాగుతోంది. ఇక వీకెండ్ అయితే బాగా కలిసొచ్చింది. మరి సోమవారం నుంచి సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post