మహేష్ బాబు ఫ్యామిలీలో వరుస విషాదాలు చోటు చేసుకోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇదే ఏడాది మొదట్లో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కూడా మృతి చెందిన విషయం తెలిసింది. ఆ తర్వాత అతని తల్లి ఇందిరాదేవి కూడా పలు అనారోగ్య సమస్యలతో కన్నుమూయడం మహేష్ బాబుకు ఫ్యామిలీలో ఒక మర్చిపోలేని విషాదం.
ఇక ఆ బాధలో నుంచి కోలుకోక ముందే మహేష్ బాబు తండ్రిని కోల్పోవడం మరింత బాధాకరమైన విషయం. ఒక విధంగా ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు అనే చెప్పాలి. అది కూడా ఒకే ఏడాదిలో ఘట్టమనేని ఫ్యామిలీలో మూడు విషాదాలు చోటు చేసుకున్నాయి. ఈ కఠిన ఏడాదిలో మహేష్ బాబు తీవ్రస్థాయిలో మనోవేదనకు గురయ్యాడు. ఒకరి తర్వాత ఒకరు తనను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే మహేష్ తీరని శోక సంద్రంలో మునిగిపోయారు. ఇక స్వర్గస్తులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే మహేష్ బాబుకు ఈ సమయంలో ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి అని కోరుకుందాం.
Follow
Post a Comment