కాంతర.. తెలుగు శాటిలైట్ రైట్స్ ఎంతంటే!

 


కన్నడ డబ్బింగ్ సినిమా కాంతార తెలుగు మార్కెట్లో 50 కోట్ల వసూళ్ళను అందుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. దాదాపు 350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను ముందుగానే అమ్మకుండా నిర్మాతలు చాలా మంచి పని చేశారు.


ఇప్పుడు వారికి ఆ రూట్లో కూడా చాలా మంచి లాభాలు అందుతున్నాయి. ఈ సినిమా శాటిలైట్ తెలుగు హక్కులను స్టార్ మా కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపు 4 నుంచి 5 కోట్లకు అటు ఇటుగా ఒక డీల్ అయితే కుదిరినట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా అత్యంత భారీ ధరకు అమ్ముడైన డబ్బింగ్ సినిమాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇక కాంతార సినిమాను మొదట ఓటీటీలో విడుదల చేసినప్పుడు పే పర్ వ్యూ పద్ధతిలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు.

Post a Comment

Previous Post Next Post