వణుకు పుట్టించిన కాంతార యాక్టర్.. ప్రభాస్ సినిమాలో లక్కీ ఛాన్స్!

 

కాంతార సినిమాలో రిషబ్ శెట్టి నటన ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమా మొదట్లో వచ్చే పంజుర్లి పూనకం సీన్ ఆడియెన్స్ ను అమితంగా బయపెట్టింది. ఇక మొదట్లో గట్టిగా అరుస్తూ కళ్ళతోనే భయపెట్టిన ఆ యాక్టర్ పేరు నవీన్ బొందెల్. అతను కన్నడ లో అంతకుముందు కొన్ని సినిమాలు చేసినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు.


ఇక కాంతార సినిమాలో నవీన్ చూపించిన హావభావాలు బాగా వర్కౌట్ అయ్యాయి. కథలోకి ఆడియెన్స్ ను తీసుకువెళ్లేందుకు ఆ సీన్ చెప్పలేని విధంగా హెల్ప్ అయ్యింది. అయితే నవీన్ కు ఇప్పుడు ఇతర సినిమా ఇండస్ట్రీల నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయట. ముఖ్యంగా ప్రభాస్ సలార్ సినిమాలో కూడా అతను ఒక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. నెగిటివ్ పాత్రల్లోనే ఒక ఎపిసోడ్ లో హైలెట్ కానున్నాడట. మరి ఆ క్యారెక్టర్ లో అతను ఎలా కనిపిస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post