టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్లలో ఎన్టీఆర్ ఒకరు. అయితే RRRతో, అతను పాన్-ఇండియా పాపులారిటీని చూశాడు. ఇక ప్రస్తుతం తన కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేసేందుకు కొంత ఆలోచిస్తున్నప్పటికి యాడ్స్ షూట్ లో మాత్రం బిజిగానే పాల్గొంటున్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం ఆన్ లైన్ మీట్ డెలివరీ యాప్ Licious కోసం యాడ్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ ప్రకటన జెట్ స్పీడ్ లోనే వైరల్ అయ్యింది. ఈ యాడ్ కోసం ఎన్టీఆర్ 3 నుంచి 4 కోట్ల మధ్యలో తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఒక యాడ్ కోసం 7 కోట్లు వసూలు చేసే అల్లు అర్జున్ లేదా రామ్ చరణ్‌లతో పోల్చినప్పుడు ఇది తక్కువ. అయితే తారక్ అంత తక్కువకి యాడ్ చేయడం వెనుక ఒక కారణం ఉందని తెలుస్తోంది. తారక్ ఇంతకుముందు కూడా యాడ్స్ లో కనిపించింది చాలా తక్కువే. ఇక అతను మరింత బిజీ అవ్వాలి అంటే ప్రముఖ బ్రాండ్స్ యాడ్స్ లో తప్పక నటించాలి. అందుకే ఈ విధంగా ఫేమస్ సంస్థలతో మొదట తక్కువకి చేసి ఆ తరువాత రెమ్యునరేషన్ హైక్ చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Follow
Post a Comment