NTR30: పవన్ కోసం అనుకున్న టైటిల్?


జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో కొత్త ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ కూడా మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. రీసెంట్ గా కొరటాల శివ కెమెరామెన్ రత్నవేలుతో అలాగే ఆర్ట్ డైరెక్టర్ తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

ఇక త్వరలోనే మొదటి షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్న కొరటాల శివ ముందుగానే ఒక టైటిల్ పై నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా కథకు సరిపోయేటట్లుగా ఒక టైటిల్ కోసం కళ్యాణ్ రామ్ కూడా చర్చలు జరిపినట్లు టాక్. గతంలో పవన్ కళ్యాణ్ కోసం బండ్ల గణేష్ రిజిస్టర్ చేయించిన దేవర అనే టైటిల్ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ను ఎక్కువగా బండ్ల గణేష్ దేవర అంటూ ఇష్టంగా పిలుచుకుంటూ ఉంటాడు. ఇక రిజిస్ట్రేషన్ చేసిన తరువాత మరో ఎడాది రెన్యూవల్ చేయించలేదట. ఇక ప్రస్తుతం ఈ టైటిల్ పై NTR30 చర్చలు జరుపుతున్నట్లు టాక్.

Post a Comment

Previous Post Next Post