నందమూరి బాలకృష్ణ క్రేజ్ ఇప్పుడు ఊహించని స్థాయిలో పెరిగిపోతుంది. అఖండ సినిమా సక్సెస్ తో బాక్స్ ఆఫీస్ వద్ద బౌన్స్ బ్యాక్ అయినా బాలయ్య ఆ సినిమాలో జై బాలయ్య అనే పాటతో బాగానే మెప్పించాడు. పాటలో థమన్ కంపోజిషన్ బాలయ్య స్టెప్పులు హైలెట్ గా నిలిచాయి. అయితే ఇప్పుడు మరోసారి అదే తరహాలో అంతకుమించి అనేలా మరో పాట రాబోతోంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి అనే సినిమాలో 'జై బాలయ్య' అనే మరొక వెర్షన్ సాంగ్ కూడా ఉండబోతోంది. సంగీత దర్శకుడు థమన్ సాంగ్ మొత్తం కూడా రెడీ చేసినట్లు సమాచారం. షూటింగ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఉండే మొత్తం నాలుగు పాటలు కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నాయట. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా థమన్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
Follow
Post a Comment