పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు షూటింగ్ చాలాసార్లు వాయిదా పడింది. ఎప్పుడో సమ్మర్ కు రావాల్సిన ఈ సినిమా ఇంకా రాలేదు. ఇక వచ్చే 2023 సంక్రాంతి కూడా మిస్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆలస్యం చేయకుండా పవన్ ఈ ప్రాజెక్ట్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు.
ఇక హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన షూటింగ్ విషయంలో ఫైనల్ గా క్రిష్ ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నాడు. సినిమా షూటింగ్ ను మరో రెండు నెలల్లో ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. ఇక 2023 సమ్మర్ కు విడుదల చేయాలని మరోక షెడ్యూల్ రెడీ చేసుకున్నారు. ఇక క్రిష్ ఇచ్చిన టార్గెట్ కు పవన్ సరెండర్ అయినట్లు తెలుస్తోంది. ఇక అనుకున్న సమయానికి షూట్ ఫినిష్ చేద్దామని మాట ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఏప్రిల్ చివరి వారంలో విడుదల కావచ్చని తెలుస్తోంది.
Follow
Post a Comment