2005 లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన చంద్రముఖి సినిమాకు మళ్ళీ చాలా కాలం తర్వాత సీక్వెల్ ను తెరపైకి తీసుకువస్తున్నారు. అదే సినిమా దర్శకుడు పీ వాసు గత ఏడాదిలోనే సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి షూటింగ్ కూడా మొదలు పెట్టినప్పటికీ మధ్యలో కొన్ని బ్రేకులు పడ్డాయి. ఇక రీసెంట్గా హైదరాబాదులో మరొక కీలక షెడ్యూల్ పెట్టారు.
అయితే ఈ సినిమాలో మరొక ముఖ్యమైన పాత్రలో బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించబొతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్స్ లలో కంగనా ఒకరు. అయితే ఆమె నటించిన గత మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు చంద్రముఖి పార్ట్ 2 లో ఆమె భయపెట్టే ఒక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
Follow
Post a Comment