పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరొకవైపు పెండింగ్లో ఉన్న షూటింగ్ పనులను కూడా త్వర త్వరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈమధ్య పాలిటిక్స్ మరింత హీటెక్కించడంతో కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న ప్రాజెక్టులను కూడా ఆయన అనుకున్న సమయానికి స్టార్ట్ చేయలేకపోతున్నారు.
ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పవన్ కళ్యాణ్ కేవలం ఒకే ఒక్క సినిమాను పూర్తిచేసే అని అనుకుంటున్నాడు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. అయితే మిగిలిన రోజులలో ఈ సినిమాను తొందరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఇక ఈ ఏడాది మొదలు పెట్టాలనుకున్న భవతీయుడు భగత్ సింగ్ సినిమాతో పాటు మరొక రీమిక్ కూడా వాయిదా చేయాలని అనుకున్నారు. ఇక ఆ రెండు సినిమాలను వాయిదా వేసుకుని దర్శక నిర్మాతలను మరొక సినిమా చేసుకోమని కూడా పవన్ ఆఫర్ ఇచ్చాడట. తప్పకుండా భవిష్యత్తులో మాత్రం సినిమా చేస్తానని మాట కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
Follow
Post a Comment